Infinix GT 30 Pro: ఇన్‌ఫినిక్స్ తన ప్రీమియమ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో తాజా మోడల్ అయిన Infinix GT 30 Pro ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 144Hz AMOLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ Dimensity 8350 Ultimate ప్రాసెసర్, షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ప్రత్యేక గేమింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది గేమింగ్ లవర్స్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోడల్.
డిస్‌ప్లే, డిజైన్:
GT 30 ప్రో ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్‌కి Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉండటం గమనార్హం. డిజైన్ పరంగా చూస్తే.. Cyber Mecha 2.0 లుక్‌తో డార్క్ ఫ్లేర్ వెర్షన్‌లో 10 LED లైటింగ్ మోడ్‌లు ఉంటాయి. అదనంగా Blade White వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
Read Also: Kawasaki Z900: కొత్త ఇంజిన్, మోడర్న్ లుక్స్‌తో వచ్చేసిన 2025 కవాసాకి Z900..!
ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 8350 Ultimate 5G ప్రాసెసర్ (4nm) ఉంటుంది. ఇది 8GB / 12GB LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్ తో లభిస్తుంది. అదనంగా 12GB వరకూ వర్చువల్ RAM తో వస్తుంది. దీని వల్ల మల్టీటాస్కింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది.
గేమింగ్ స్పెషల్ ఫీచర్లు:
ఈ ఫోన్‌లో గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 520Hz shoulder triggers, 6-లేయర్ VC కూలింగ్ వ్యవస్థ కలిగి ఉంది. ఇది 120FPS BGMI గేమ్‌కు Krafton సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి ఫోన్. GT Gaming Kit తో పాటు మాగ్నెటిక్ కూలింగ్ ఫ్యాన్, GT కేస్ ను రూ. 1,199 ప్రత్యేక ధరకు పొందవచ్చు.
Read Also: RCB vs PBKS: చివర్లో తడబడ్డ ఆర్సీబీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
కెమెరా, ఫీచర్లు:
108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 13MP సెల్ఫీ కెమెరా వంటి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇతర ఫీచర్లలో Android 15 ఆధారిత XOS 15 UI, ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, ఫోలీక్స్ అసిస్టెంట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, IR బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు, IP64 రేటింగ్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.
బ్యాటరీ:
ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్‌లెస్ చార్జింగ్, ఇంకా రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 6, Bluetooth 5.4, NFC, GNSS, 5G బాండ్‌లకు సపోర్ట్ ఉంది.
ధర:
8GB + 256GB వేరియంట్ ధర రూ. 24,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 26,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ జూన్ 12 నుండి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద ఐసీసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో రూ. 2000 తగ్గింపు, లేదా ఎక్స్చేంజ్ ఆఫర్‌లో అదనంగా రూ. 2000 తగ్గింపు లభించనున్నాయి.