ఒకప్పుడు వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ లలో ఒకటి నటి ఇంద్రజ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.. సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. అంతేకాదు బుల్లితెర పలు షోలల్లో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఇది ఇలా ఉండగా ఇంద్రజ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది..
ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా గడిపేస్తున్న ఆమె.. తాజాగా ఓ స్టేజ్ పై చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. హీరోయిన్ గా వెయిడ్ అవుటు అయిన ఈ తార.. ప్రస్తుతం వెండితెరపైనే కాకుండా..బుల్లితెరపై కూడా ఒక ఊపు ఊపేస్తోంది.. చాలా మంది బుల్లితెరపై తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వీరిలో చాలా వరకు సూపర్ స్టార్డమ్ దక్కించుకున్నారు కూడా. అయితే.. లేట్ గా ఈ లిస్ట్ లో చేరిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. ఆమధ్యే జబర్థస్త్ లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. వరుస సినిమాలతో, షో లతో ఫుల్ బిజీగా ఉంది..
జబర్థస్త్ తో పాటు.. ఎక్స్ ట్రా జబర్థస్త్.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. పండగ ప్రోగ్రామ్స్ తో..బిజీగా ఉంది..బుల్లితెర ప్రేక్షుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది ఇంద్రజ. లేదు. ఇప్పుడు అన్ని షోలలో ఇంద్రజ కనిపిస్తూనే ఉంది… అయితే తాజాగా ఓ షో లో అద్భుతమైన డ్యాన్స్ చేసింది.. ఆ తర్వాత ఇంద్రజ బాగా ఎమోషనల్ అయిపోయింది. తనకి అందిన ప్రశంసలు చూసి ఇంద్రజ ఆనందాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. తనని మళ్ళీ ఒక డ్యాన్సర్ గా చూసుకుని ఆమె ఏడ్చేసింది.. తన జీవితంలో జరిగిన పలు విషయాలను తలచుకొని ఎమోషనల్ అయ్యింది.. అందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు..