Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daayra: కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘దాయ్రా’ (Daayra). జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్ కుమార్ పాత్రలో, కరీనా కపూర్ డీసీపీ అజూని కోహ్లీ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు.
నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషనల్ ట్రైలర్‌ను నిన్ననే (సెప్టెంబర్ 15న) విడుదల చేశారు. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్, ప్రోమోలలో కనిపిస్తున్న కొన్ని సన్నివేశాలు 2019లో హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ పై అఘాయిత్యం, హత్య కేసుతో పాటు ఆ తర్వాత జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేస్తున్నాయి. దీంతో అసలు ‘దాయరా’ కథ దిశ కేసు ఆధారంగానే తెరకెక్కిందా? అనే చర్చ మొదలైంది. సినిమా ట్రైలర్ చూశాక ‘దాయరా’ 2019 హైదరాబాద్ దిశా (వెటర్నరీ డాక్టర్) పై అఘాయిత్యం, పోలీస్ ఎన్కౌంటర్ ఆధారంగా మాత్రమే వస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
అయితే ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ‘దాయరా’ 2019 హైదరాబాద్ అత్యాచారం, హత్య కేసును నేరుగా ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా మాత్రం కాదని మేఘనా గుల్జార్ స్పష్టం చేశారు. సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయంపై మాట్లాడిన ఆమె, కథను ఒకే ఘటనకు పరిమితం చేయలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, వాటిలోని వివిధ అంశాలను తీసుకుని ‘దాయరా’ కథను రూపొందించినట్లు వెల్లడించారు. అందుకే ఈ సినిమాను ఒక సిటీ, రాష్ట్రం, పోలీస్ విభాగానికి సంబంధించిన కథగా చూడకూడదని ఆమె వివరించారు.
ఇక 2019లో హైదరాబాద్ శివార్లలో జరిగిన ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలిపై అఘాయిత్యం చేసి హత్య చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 2019 డిసెంబర్ 6న నిందితులను చటాన్‌పల్లికి తీసుకెళ్లిన సమయంలో వారు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నలుగురూ మరణించారని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దర్శకురాలు చెబుతున్నట్టు.. నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నిజంగానే దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా ? లేక మరో కోణంలో కథ నడుస్తుందా ? అనేది సెప్టెంబర్ 18 థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యాకే క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!