G20 Presidency to India: అధికారికంగా భారత్‌కు జీ20 అధ్యక్ష పగ్గాలు.. బాధ్యతలు అందుకున్న మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Presidency to India: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండు రోజులుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష వహించనున్నట్లు స్పష్టమైంది. సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. ప్రస్తుత జీ 20 సమావేశాల ముగింపు కార్యక్రమం ఈ రోజు జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా వచ్చే నెల 1 నుంచి చేపట్టనుంది. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
Read Also: Big Shock to Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ.. పార్టీ మారనున్న సీనియర్ నేత?
Also Read
బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా మోదీ చెప్పుకొచ్చారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’అనే నినాదంతో, వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గొప్ప గర్వకారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ మార్పునకు ఉత్ప్రేరకంగా జీ20 సదస్సును మారుస్తామని ప్రధాని హామీనిచ్చారు. ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన పనులను భారత్ ప్రారంభించింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న సమావేశాల కోసం వెబ్సైట్, లోగోను కూడా ఇప్పటికే ఆవిష్కరించింది.
It is India's time now!
The new President of the G20 🇮🇳 pic.twitter.com/ZQrDU72xWh
— Piyush Goyal (@PiyushGoyal) November 16, 2022
- Tags
- G20
- india
- Indonesia
- joko widodo
- modi
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు