INDIA’s First Coordination Panel Meet : అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్ తర్వాత తొలిసారి కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇందులో 14 మంది సభ్యులు ఉంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.…