అక్రమ మార్గాల ద్వారా భారతీయులను అమెరియాలోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అమెరికాన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ మానవ రవాణాపై యుఎస్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కదిలికలపై నిఘా వేసి ఉంచారు. స్మగ్లింగ్ చేసే వ్యక్తులపై కఠినంగ వ్యవహరిస్తున్నారు. భారతీయుల స్మగ్లింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలతో ప్రమేయం ఉన్న భారత పౌరుడు సిమ్రంజిత్ సింగ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also : Apple: లేఆఫ్స్ జాబితాలోకి ఆపిల్.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం..
కెనడాలో నివసిస్తున్న సిమ్రంజిత్ సింగ్ (40) భారతీయుల అక్రమ రావాణాకు సంబంధించిన పలు ఆరోపణలపై గత వారం కెనడా నుంచి అమెరికాకు రప్పించారు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం నుంచి అభ్యర్థనను అనుసరించి జూన్ 2022లో కెనడాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మార్చ్ 2023లో అతన్ని అమెరికాకి రప్పించారు. భారీగా డబ్బులు తీసుకొని గ్రహాంతర స్మగ్లింగ్ కు కుట్ర పన్నారనే ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి.
Read Also : Minister KTR: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ రకాలు
సిమ్రంజిత్ సింగ్ పై మూడు కేసులు భారతీయుల అక్రమ రవాణాకు కు సంబంధించినవి ఉండగా.. అదనంగా మరో ఆరు కేసులు అతనిపై ఉన్నాయి. డబ్బులు భారీగా తీసుకొని కెనడా నుంచి అమెరికాకు ఇతడు భారతీయుల అక్రమ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మార్చ్ 2020-2021 మార్చ్ మధ్య సెయింట్ లారెన్స్ నది ప్రాంతంలోని కార్న్వాల్ ద్వీపం అక్వేసాస్నే మోహాక్ ఇండియన్ రిజర్వేషన్ ద్వారా కెనడా నుంచి అమెరికాకు భారతీయులను స్మగ్లింగ్ తరలించే ప్రయత్నంలో పాల్గొన్నాడని తేల్చారు. ప్రస్తుతానికి ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే దోషిగా నిరూపించబడే వరకు సిమ్రంజిత్ సింగ్ నిర్థోషిగా ఉంటాడు.