Indian Student Rape: యూకేలో ఓ మహిళపై భారతీయ విద్యార్థి ప్రీత్ వికల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యయి. మద్యం మత్తులో ఆ మహిళను తన చేతుల్లో మరియు భుజాల మీద తీసుకెళ్తున్నట్లు కనిపించాయి. దీంతో ఆ యువకుడు అత్యాచారం చేసినట్లు అక్కడి పోలీసులతో చెప్పాడు. అయితే యువ నేరస్థుల సంస్థలో అతనికి 6 సంవత్సరాల 9 నెలల జైలు శిక్ష విధించారు. జూన్ 3న నగరంలో స్నేహితులతో కలిసి రాత్రిపూట విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఆ మహిళను కలిసిన వికల్ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు
బాధిత మహిళ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో.. తన స్నేహితుల మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తరువాత కింగ్ ఎడ్వర్డ్ VII అవెన్యూ మరియు నార్త్ రోడ్‌లో ప్రీత్ వికాల్ తీసుకువెళుతున్నట్లు CCTVలో కనిపించింది. అనంతరం నార్త్ రోడ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై అక్కడి పోలీసులు ఏమన్నారంటే.. ఇలాంటి స్ట్రేంజర్ దాడులు కార్డిఫ్‌లో చాలా అసాధారణమైనవి, కానీ ప్రీత్ వికల్ ఒక డేంజరస్ వ్యక్తిలా ఉన్నాడు. అతను తన స్నేహితుల నుండి విడిపోయి.. తాగిన మత్తులో యువతిపై అత్యాచారం చేశాడని తెలిపారు. అంతేకాకుండా సీసీవీ ఆధారంగా అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
Read Also: Manik Rao Thakre : పేదలను విస్మరించి, కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారు
అయితే ఈ ఘటనపై బాధిత మహిళ స్పందిస్తూ.. తనపై జరిగిన దాడితో తాను నిద్రపోలేకపోయానని తెలిపింది. తనపై అత్యాచారం చేస్తున్న వీడియోలను తన మొబైల్ లో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ ఆ సమయంలో ఎక్కడున్నానో.. అసలేమైందో తెలియలేదని చెప్పింది.