Site icon NTV Telugu

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

Stock Market

Stock Market

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా.. అదే బాటలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా పయనిస్తున్నాయి. మార్చి 2న భారత్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3 హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చ్ 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. సెషన్ ఆరంభం కాగానే ఏకంగా 1700 పాయింట్లకు నష్టంలోకి వెళ్ళింది సెన్సెక్స్.

SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!

ఈ క్రమంలోనే మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద భారీగా పతనమైంది. మదుపరుల సంపదగా పరిగణించే BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 12 లక్షల కోట్లకు పైగా పతనంతో 445 లక్షల కోట్లకు పడిపోయింది. కిందటి సెషన్ లో ఇది 457 లక్షల కోట్లుగా ఉండేది. సెషన్ ప్రారంభమైన నిమిషాల్లోనే ఇలా జరగడంతో ఇన్వెస్టర్లకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

Bollywood : బాలీవుడ్‌లో గతేడాది అతి పెద్ద సర్‌ప్రైజ్ హిట్ సినిమా ఇదే

స్టాక్ మార్కెట్లు పతనం అయ్యేందుకు చాలా కారణాలే ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేల పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడి చేస్తుండగా.. ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. ఇది సమీపంలోని గల్ఫ్ దేశాలపైన బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇదే సమయంలో హర్మోస్ జలసంధిని దాటాలని ప్రయత్నించే ఏ నౌకనైనా నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకు క్షీణిస్తూ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం డొల్లర్తో పోలిస్తే రూపాయి మారకపు ధర రూ. 92.17 పైసలు వద్ద కొనసాగుతుంది. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయగా అమ్మకాల ఉత్తిడి నెలకొంది.

Exit mobile version