NTV Telugu Site icon

Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ

Rupee

Rupee

Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. మంగళవారం నాడు రూపాయి ఏకంగా 66 పైసలు క్షీణించింది. గత రెండేళ్లలో ఇంత స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, గతంలో 2023 ఫిబ్రవరి 6న రూపాయి 68 పైసలు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో క్షీణించి ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపాయి విలువ 86.70 స్థాయికి చేరింది. ఇది రూపాయి చరిత్రలో అతి కనిష్ఠ స్థాయిగా నిలిచింది. భారతీయ కరెన్సీ గత కొన్ని రోజులుగా డాలర్ ముందు నిలదొక్కుకోలేకపోతోంది. అమెరికా మార్కెట్‌లో ఉద్యోగ వృద్ధి అంచనాలకు మించి నమోదవడంతో డాలర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఫారెక్స్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఎగుమతుల కంటే దిగుమతులే అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెబుతున్నారు.

Also Read: Kapil Dev: ఏంటి భయ్యా.. ఆయనను కపిల్ దేవ్ అంత మాట అనేశాడు

రూపాయి పతనం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దిగుమతుల ఖర్చులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సామాన్య ప్రజలకు నష్టాన్ని కలిగించే పరిస్థితి. మరోవైపు రూపాయి పతనంపై రాజకీయ ప్రకంపనలు కూడా రేగాయి. అధికార బీజేపీ మాత్రం రూపాయిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థిరమైన కరెన్సీల్లో ఒకటిగా చెబుతుండగా.. విపక్ష కాంగ్రెస్ దీనిపై విమర్శలు గుప్పిస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిని బీజేపీ పూర్తిగా విస్మరించిందని, రూపాయి విలువ మసిబూసి మారేడుకాయలా మారుతోంది అంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు.

Also Read: Marnus Labuschagne: మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అంటూ పోస్ట్

ఇకపోతే, ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువను నిలబెట్టేందుకు ప్రభుత్వ విధానాలలో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడం, దిగుమతులపై నియంత్రణలు విధించడం వంటి చర్యలు రూపాయి విలువను కొంతవరకు స్థిరంగా ఉంచవచ్చు.

Show comments