Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ
- డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా పతనం.
- మంగళవారం నాడు ఏకంగా 66 పైసలు క్షిణించిన రూపాయి.
- ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 86.70 స్థాయికి చేఉకున్న రూపాయి విలువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. మంగళవారం నాడు రూపాయి ఏకంగా 66 పైసలు క్షీణించింది. గత రెండేళ్లలో ఇంత స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, గతంలో 2023 ఫిబ్రవరి 6న రూపాయి 68 పైసలు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో క్షీణించి ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపాయి విలువ 86.70 స్థాయికి చేరింది. ఇది రూపాయి చరిత్రలో అతి కనిష్ఠ స్థాయిగా నిలిచింది. భారతీయ కరెన్సీ గత కొన్ని రోజులుగా డాలర్ ముందు నిలదొక్కుకోలేకపోతోంది. అమెరికా మార్కెట్‌లో ఉద్యోగ వృద్ధి అంచనాలకు మించి నమోదవడంతో డాలర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఫారెక్స్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ఎగుమతుల కంటే దిగుమతులే అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: Kapil Dev: ఏంటి భయ్యా.. ఆయనను కపిల్ దేవ్ అంత మాట అనేశాడు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
రూపాయి పతనం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దిగుమతుల ఖర్చులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సామాన్య ప్రజలకు నష్టాన్ని కలిగించే పరిస్థితి. మరోవైపు రూపాయి పతనంపై రాజకీయ ప్రకంపనలు కూడా రేగాయి. అధికార బీజేపీ మాత్రం రూపాయిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థిరమైన కరెన్సీల్లో ఒకటిగా చెబుతుండగా.. విపక్ష కాంగ్రెస్ దీనిపై విమర్శలు గుప్పిస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిని బీజేపీ పూర్తిగా విస్మరించిందని, రూపాయి విలువ మసిబూసి మారేడుకాయలా మారుతోంది అంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు.
ఇకపోతే, ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువను నిలబెట్టేందుకు ప్రభుత్వ విధానాలలో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడం, దిగుమతులపై నియంత్రణలు విధించడం వంటి చర్యలు రూపాయి విలువను కొంతవరకు స్థిరంగా ఉంచవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!