Marnus Labuschagne: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్నస్ లాబుషేన్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య రెబేకా గర్భవతి అని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోటీలను ఆయన షేర్ చేశారు. ఈ జంటకి ఇప్పటికే ఒక కూతురు ఉంది. లాబుషేన్ తన ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో.. వచ్చే ఏప్రిల్‌లో మా కుటుంబంలో మరో సభ్యుడు (అబ్బాయి) చేరబోతున్నాడు. మా కుటుంబం ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని పేర్కొన్నారు. ఇకపోతే లాబుషేన్, రెబేకా ఇద్దరూ క్రిస్టియన్ కుటుంబాలకు చెందినవారు. వారిద్దరి పరిచయం బ్రిస్బేన్‌లోని గేట్‌వే బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగింది. చిన్న వయసు నుంచే వారు మంచి స్నేహితులు. కొంతకాలానికి వారి స్నేహం కాస్త ప్రేమగా మారి.. 2017లో వివాహం చేసుకున్నారు.
Also Read: ESIC Jobs: భారీగా జీతాలు.. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇకపోతే, లాబుషేన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు కీలక ఆటగాడుగా ఉన్నాడు. ఆయన త్వరలో జరగబోయే శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నారు. లాబుషేన్ మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా త్వరలో తండ్రి అవుతున్నారు. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొద్ది రోజుల క్రితం తండ్రి అయ్యారు. ఇక లాబుషేన్ తన భార్య గర్భవతి అని తెలిపిన తర్వాత సోషల్ మీడియాలో జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు వారి కుటుంబానికి పెద్దెత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.