Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways Food Prices Hiked: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కూడా కనిపించనుంది. భారతీయ రైల్వేలోని సెంట్రల్ రైల్వే జోన్ స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. కొత్త ధరలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్ రైల్వే సోమవారం ఆహార పదార్థాల ధరల పెంపుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కొత్త మెనూ జాబితాను కూడా విడుదల చేసింది. మొత్తం 33 రకాల ఆహార పదార్థాలకు కొత్త ధరలను నిర్ణయించగా, మరో 16 వంటకాల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది.
రైల్వే విడుదల చేసిన నోటిఫికేషన్లో, “స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో విక్రయించే ‘అలా కార్ట్’ ఆహార పదార్థాల ధరలను సవరించేందుకు సంబంధిత అధికార సంస్థ ఆమోదం తెలిపింది. కొత్త మెనూ, ధరలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని లైసెన్సుదారులు కొత్త ధరల జాబితాను రెండు భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి” అని పేర్కొంది. అదేవిధంగా.. ధరల పెంపుతో పాటు ఆహార నాణ్యత కూడా మెరుగుపడాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఫుడ్ క్వాలిటీ, పరిమాణంపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై కూడా విచారణలు చేపట్టాలని సూచించింది.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత దేశంలోని ఇతర రైల్వే జోన్లు కూడా ఆహార ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, ఇంధన ధరల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరల ప్రకారం ఆలూ వడ ఒక్కటి రూ.15, వెజ్ సమోసా రూ.20, వెజ్ శాండ్విచ్ రూ.35గా నిర్ణయించారు. అలాగే మసాలా దోసా రూ.35, పవ్ భాజీ రూ.50, చోలే పూరీ రూ.40, వెజ్ పిజ్జా రూ.50గా ధరలు ఖరారు చేశారు. వీటితోపాటు ఫ్రెష్ జ్యూసుల ధరలు కూడా పెరిగాయి. క్యారెట్, పైనాపిల్, మామిడి, పుచ్చకాయ జ్యూస్ 200 మిల్లీలీటర్లకు రూ.25గా ఉండగా, స్వీట్ లైమ్, ఆరెంజ్, ఆపిల్ జ్యూస్ రూ.40గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!