అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాంటా అనాలో భారత సంతతికి చెందిన మహిళ తన 11 ఏళ్ల కొడుకును గొంతుకోసం చంపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ మహిళను 48 ఏళ్ల సరితా రామరాజుగా గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం దోషిగా తేలితే ఆమెకు 26 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని తెలిపింది.
Also Read:Ponnam Prabhakar : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో విడాకులు తీసుకున్న తర్వాత రామరాజు కాలిఫోర్నియా నుంచి వెళ్లిపోయాడు. ఆమె తన కొడుకుతో కలిసి శాంటా అనాలో ఒక మోటెల్‌లో ఉంటోంది. ఆమె తనకు.. తన కొడుకుకు డిస్నీల్యాండ్‌కు మూడు రోజుల పాస్‌లను కొనుగోలు చేసింది. మార్చి 19న రామరాజు మోటెల్ నుంచి బయటకు వెళ్లి అబ్బాయిని అతని తండ్రికి తిరిగి అప్పగించాల్సిన రోజు, ఆమె ఉదయం 9.12 గంటలకు ఎమర్జెన్సీ నెంబర్ 911 కు ఫోన్ చేసి తన కొడుకును చంపి, ఆత్మహత్యకు మాత్రలు వేసుకున్నట్లు తెలిపింది.
Also Read:Keerthy Suresh : బాలీవుడ్ లో మరో సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తన కొడుకును చంపి, మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె అంగీకరించింది. గదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయిన బిడ్డను యతిన్ రామరాజుగా గుర్తించారు. సరితా రామరాజును అరెస్టు చేశారు. గత సంవత్సరం నుంచి సరితా రామరాజు, రామరాజు మధ్య కస్టడీ వివాదం కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. వైద్య చికిత్స, పాఠశాల విద్యకు సంబంధించిన నిర్ణయాలను రామరాజు ఏకపక్షంగా తీసుకున్నాడని.. అతను డ్రగ్స్ కు బానిసయ్యాడని సరిత ఆరోపించింది. రామరాజు బెంగళూరులో జన్మించాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఇద్దరు తల్లిదండ్రుల మధ్య కోపం కారణంగా పిల్లల జీవితాన్ని ప్రమాదంలో పడేయకూడదు అని ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ టాడ్ స్పిట్జర్ అన్నారు.