Keerthy Suresh : బాలీవుడ్ లో మరో సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానటి ఇమేజ్ వల్ల టాలీవుడ్లో గీరిగీసుకుని వర్క్ చేసింది కీర్తి సురేష్. నో ఎక్స్ పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచేసింది. సౌత్‌లో ఎక్స్ పోజింగ్కు నో చెప్పిన మహానటి నార్త్ బెల్ట్‌కు ఇలా వెళ్లిందో లేదో బేబీ జాన్‌తో రూల్స్ బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత చేయలేనేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు మలయాళ బ్యూటీకి. బేబీ జాన్ డిజాస్టర్ బాలీవుడ్ కెరీర్ డైలమాలో పడేట్లు చేసింది.
Also Read : Tollywood : ఆ సినిమా ఇన్ సైడ్ టాక్.. చాలా బాగా చెప్తున్నారు
Also Read
ఇక బేబీ జాన్ కన్నా ముందే అక్కా అనే వెబ్ సిరీస్ చేసింది కీర్తి. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బోల్ట్ లుక్కులో రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లో దర్శనమిచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో లేడీ ఓరియెంట్ చిత్రాల్లో నటించింది కీర్తి కానీ ఆ సినిమాలలతో పోల్చకుంటే ఈ సిరీస్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తోంది. సౌత్‌లో హోమ్లీ గర్ల్‌గా ముద్ర పడటం వల్లో ఏమో నార్త్ బెల్ట్‌లోకి వెళ్లగానే గ్లామర్, ఎక్స్ పోజింగ్ హీరోలతో ఓవర్ రొమాన్స్ చేసింది మేడమ్. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కింది కీర్తి. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఆంటోనీ థాటిల్ ను వివాహం చేసుకుని.. సెట్స్, షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ సారి బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ పెడుతోంది. హిందీలో ఓ రామ్ కామ్ మూవీకి కమిటైనట్లు టాక్. ఇవే కాకుండా తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివీడి చేస్తుంది. తెలుగులో భోళా శంకర్ తర్వాత కల్కికి బుజ్జికి వాయిస్ ఇచ్చింది తప్ప మరో కొత్త సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!