శృతి హాసన్..ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది వరుసగా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి చిత్రాలలో నటించి మెప్పించింది.. ఈ రెండు సినిమా లు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.. ఈ భామ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఆద్య పాత్రలో కనిపించనుంది.ప్రస్తుతం ఈ భామ చేతిలో సలార్ చిత్రం మాత్రమే ఉంది.అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ భామకు మరోసారి అవకాశాలు తగ్గాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ.ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది..అలాగే తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికతో, చెల్లెలు అక్షరతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ ను కూడా షేర్ చేస్తుంది.
ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మెరిసి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది శృతి. ఈ వేదికపై అవార్డ్ కూడా అందుకుంది. ఇక ఈ భామ దుబాయ్ నుంచి మంగళవారం తిరిగి ముంబై కి చేరుకుంది. అయితే ముంబై ఎయిర్ పోర్టులో శృతికి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని చేసిన పనికి భయంతో శృతి పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.ముంబై ఎయిర్ పోర్టు లోపలి నుంచి పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కారు దగ్గరకు వస్తున్న శృతి ని ఓ వ్యక్తి వెంబడించాడు..శృతి పక్కనే నడుస్తూ ఆమెను కాస్త భయానికి గురిచేశాడు. అతడిని గమనించిన శృతి ఆగి ఎవరు అని ప్రశ్నించడంతో పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరికాసేపటికి అదే వ్యక్తి శృతి వెనకే వచ్చాడు. ఆమె కారు ఎక్కే వరకు ఫాలో అవుతూనే ఉన్నాడు. ప్రతిసారి అతడి నుంచి దూరంగా వెళ్ళేందుకు శృతి ప్రయత్నించింది.. ఆ వ్యక్తి చేష్టలకు భయపడిపోయి వెంటనే కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతంఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.