Site icon NTV Telugu

Big Breaking : భారత్‌ ఆర్మీ అదుపులో పాక్‌ పైలట్‌

Pak Pilot Indian Army

Pak Pilot Indian Army

Big Breaking :  భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్‌ను కూడా కూల్చివేసినట్లు సమాచారం అందుతోంది. వివరాల ప్రకారం, పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు ఆ విమానాన్ని నేలకూల్చారు.

PBKS vs DC: పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ మధ్యలోనే రద్దు.. స్టేడియం నుంచి ఫ్యాన్స్ బయటికి పరుగులు!

ఈ ఘటనతో పాకిస్తాన్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం కూడా భారత సైన్యం పాకిస్తాన్‌కు చెందిన ఒక F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో F-16ను కూల్చివేయడం భారత సైన్యం  అప్రమత్తతకు, సమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కూల్చివేసిన F-16 యుద్ధ విమానానికి చెందిన పాక్ పైలట్‌ను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆ పైలట్‌ను జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Operation Sindoor Live Updates: భారత్‌ ఆర్మీ అదుపులో పాక్‌ పైలట్‌…

Exit mobile version