Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్న చందంగా మారింది. భారత్‌తో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి పెను శాపంగా పరిణమించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్, ఇప్పుడు నిధుల కోసం ప్రపంచ దేశాల ముందు ఆర్తనాదాలు చేస్తోంది. తొందరపాటుతో యుద్ధానికి దిగిన పాక్, భారత దాడులతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ భాగస్వాములను, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకును…
VC Sajjanar : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సైబర్ నేరగాళ్లు తమ దందాను పెంచుకోవడానికి అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ అమాయక ప్రజలకు సందేశాలు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన.. కొందరు మోసగాళ్లు ఆర్మీ అధికారులమని నమ్మబలుకుతూ…
Rajnath Singh : భారతదేశంలో పాక్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకు కీలక స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఘర్షణాత్మక దాడుల అనంతరం దేశ రాజధానిలో రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక భేటీకి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. వారందరూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతులపై సమగ్రంగా చర్చించారని తెలుస్తోంది.…
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంశవ్యవస్థ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి ఉన్న జేడీ వాన్స్ ఈ వివాదంలో అమెరికా పాత్రపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. Operation Sindoor 2:…
Indian Army : పాకిస్తాన్ నిన్న రాత్రి డ్రోన్ దాడులపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్ డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించాయని, కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పలు సున్నిత ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పాక్ కుట్రలను ముందుగానే గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. LOC వెంబడి పాక్ డ్రోన్ల…
Samba : భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, గురువారం రాత్రి సాంబా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు తెగబడిన ఉగ్రవాదులకు భారత జవాన్లు నరకం చూపించారు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లు జైషే మహమ్మద్‌కు చెందిన 10 నుంచి 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం చొరబాటు ప్రయత్నం మాత్రమే కాదు, పాకిస్తాన్…
Big Breaking : భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్‌ను కూడా కూల్చివేసినట్లు సమాచారం అందుతోంది. వివరాల ప్రకారం, పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు…
Big News : జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనయ్యారు. గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని విమానాశ్రయం (Jammu Airport) సహా ఏడు ప్రధాన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలతో నగరంలో ఒక్కసారిగా ఆందోళన ఏర్పడింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై, సమగ్ర గాలింపు చర్యలు ప్రారంభించాయి. తాత్కాలికంగా నగరాన్ని బ్లాక్ అవుట్ చేయగా, ప్రజలకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం, జమ్మూ నగరంపై విధించిన బ్లాక్ అవుట్…