PBKS vs DC: పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే రద్దు.. స్టేడియం నుంచి ఫ్యాన్స్ బయటికి పరుగులు!
- పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే రద్దు
- పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ రద్దు
- స్టేడియం నుంచి ఫాన్స్ బయటికి పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. బ్లాక్ ఔట్ కారణంగా స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. తక్షణమే ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని అధికారులు సూచన చేశారు. దాంతో మైదానంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫాన్స్ అందరూ బయటికి పరుగులు తీశారు.
పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ఔట్ అవుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో కూడా బ్లాక్ ఔట్ అయింది. స్టేడియంలోని ఓ ఫ్లడ్ లైట్ చెడిపోయింది. స్టేడియంలో ఫ్లడ్ లైట్ సమస్య తలెత్తడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు ఉన్నపళంగా రద్దు చేశారు. ఆటగాళ్లను కూడా వెంటనే ధర్మశాల స్టేడియం నుండి బయటకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది.
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
మ్యాచ్ రద్దయ్యే సమయానికి పంజాబ్‌కింగ్స్ 10.1 ఓవర్లకు 1 వికెట్ నష్టపోయి 122 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (70) హాఫ్ సెంచరీ బాదాడు. ప్రభుసిమ్రన్ సింగ్ (50), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజులో ఉన్నారు. ప్రియాంశ్ ఆర్య 25 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. 28 బంతుల్లో ప్రభుసిమ్రన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ బౌలర్ దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?