ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. లైట్ల వెలుతురులో స్కోర్‌ను డిఫెండ్ చేయాలనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. ఇప్పటికే శ్రీలంకపై వన్డే, టీ20 గెలిచి విజయోత్సాహంతో ఇండియా ఉంది. ఈ వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న భారత్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సమరానికి సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్‌పై వన్డే సిరీస్ గెలిచి న్యూజిలాండ్ కూడా జోరుమీదుంది. అయితే.. నేడు ఉప్పల్‌లో కివీస్-భారత్‌ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. వన్డేల్లో, టీ20ల్లోనూ కివీస్ పై భారత్ పైచేయిగా ఉంది. మరి నేడు తొలి మ్యాచ్ గెలిచి సిరీస్ లో బోణీ ఎవరు కొట్టనున్నారో చూడాలి మరీ..
Also Read : Revanth Reddy: నిజాం రాజు అంతక్రియలను తప్పుపట్టే వారు మానసిక అంగవైకల్యం కలవారు
టీమిండియా తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్
న్యూజిలాండ్ తుది జట్టు: అలెన్, కాన్వే, నికోల్స్, డారిల్ మిచెల్, లాథమ్ (కెప్టెన్, కీపర్), ఫిలిప్స్, మిచెల్ బ్రేస్‌వెల్, శాంట్నర్,హెన్రీ షిప్లీ, టిక్నర్, ఫెర్గూసన్.
Also Read : Custody: ‘రేవతి’గా మారిన బేబమ్మ… కటకటాల వెనక్కి ఎందుకు వెళ్లింది?