Custody: ‘రేవతి’గా మారిన బేబమ్మ… కటకటాల వెనక్కి ఎందుకు వెళ్లింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి. క్యూట్ లుక్స్ తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండడంతో మొదటి సినిమాతోనే సినీ అభిమానులు బేబమ్మకి కనెక్ట్ అయ్యారు. డెబ్యు మూవీ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు, తమిళ దర్శక నిర్మాతలు కృతి శెట్టి డేట్స్ కోసం ఎగబడ్డారు. కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ ఈ తొందరలో కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోయింది. దీంతో ఎంత త్వరగా పేరొచ్చిందో రాంగ్ డెసిషన్స్ తో కృతి శెట్టి అంతే త్వరగా తన కెరీర్ ని కష్టాల్లో పడేసుకునే స్టేజ్ కి వెళ్లింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఉన్న సినిమాల్లో హిట్ అయ్యే ఛాన్స్ కాస్త ఎక్కువగా ఉన్న సినిమా ‘కస్టడీ’.
తమిళ క్రియేటివ్ దర్శకుడు ‘వెంకట్ ప్రభు’ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. కృతి శెట్టి ‘రేవతి’గా నటిస్తున్న ఈ మూవీలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. జైల్లో కటకటాల వెనక కృతి శెట్టి నిలబడి ఉన్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. కృతి శెట్టికే కాదు నాగ చైతన్యకి కూడా కస్టడీ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2022ని నాగ చైతన్య ఫ్లాప్ తో ఎండ్ చేశాడు. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలి అంటే కస్టడీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సిందే. ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. బంగార్రాజు సినిమాతో హిట్ ఇచ్చిన నాగ చైతన్య, కృతి శెట్టిలు కలిసి నటిస్తున్నారు కాబట్టి కస్టడీ సినిమా కూడా హిట్ అయితే ఈ హీరో-హీరోయిన్ ని హిట్ పెయిర్ అయిపోతారు.
Also Read
Introducing our Charming and Gorgeous @IamKrithiShetty as the Resilient #Revathi🔥 from #Custody ❤️🔥
A @vp_offl HUNT💥#CustodyOnMay12@chay_akkineni @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar #Priyamani #SampathRaj @SS_Screens @jungleemusicSTH pic.twitter.com/5N96cMCshc
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 18, 2023
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!