ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిని 228 పరుగుల తేడాతో ఇండియా చిత్తు చేసింది. భారత్ తొలుత 356/2 స్కోర్ చేయగా, పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా నసీమ్ హరీస్ రౌఫ్ బ్యాటింగుకు రాకపోవడంతో భారత్ విజయం ఖరారైంది. కుల్దీప్ యాదవ్ 5, బుమ్రా, హార్ధిక్, శార్థూల్ తలా వికెట్ తీశారు. అయితే.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో రెచ్చిపోగా… కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
Also Read : Chandrababu Fan : చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన గుండె.. నివాళులు అర్పించిన టీటీడీపీ నేతలు
ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన పాక్ జట్టు ఆరంభం బాగోలేదు. ఐదో ఓవర్లో 17 పరుగుల స్కోరు వద్ద ఇమామ్ ఉల్ హక్ రూపంలో జట్టుకు తొలి దెబ్బ తగిలింది. దీంతో తొలి 10 ఓవర్లలో పాక్ జట్టు 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. 11వ ఓవర్‌లో, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుకు అతిపెద్ద దెబ్బను అందించాడు. అతని అద్భుతమైన ఇన్‌స్వింగ్ బాల్‌లో వారి కెప్టెన్ బాబర్ అజామ్‌ను బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 24 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫకార్ జమాన్ (27), ఆఘా సల్మాన్ (23) ఫర్వాలేదనిపించగా మిగిలిన వారు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా, బుమ్రా, పాండ్య, శార్దూల్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
Also Read : Ponnavolu Sudhakar Reddy: చంద్రబాబుపై సీఐడీ లాయర్ సంచలన వ్యాఖ్యలు..