ICC U19 Women’s T20 WC 2025: టీ 20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు ప్రకటన..
- ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటన
- అండర్-19 జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్, వైస్ కెప్టెన్ సానికా చాల్కే
- 18 జనవరి 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు కౌలాలంపూర్‌లో టోర్నమెంట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. భారత మహిళల అండర్-19 జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వైస్ కెప్టెన్‌గా సానికా చాల్కే వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ 18 జనవరి 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతుంది. కాగా.. ఆసియా కప్ విజేత జట్టులో ఉన్న 14 మంది ఆటగాళ్లను జట్టులో ఉంచారు. ఒకే ఒక్క మార్పు ఫాస్ట్ బౌలర్ వైష్ణవి ఎస్ స్థానంలో నందన ఎస్ ను తీసుకున్నారు. అలాగే.. జట్టులో కమలిని జి, భావికా అహిరే రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండగా.. ముగ్గురు స్టాండ్‌బై ప్లేయర్లు నందన ఎస్, ఇరా జె, అనాది టి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, మలేషియా, వెస్టిండీస్, శ్రీలంక గ్రూప్-ఎలో ఉన్నాయి. జనవరి 19న కౌలాలంపూర్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి 4 గ్రూపులలో 4 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లోని టాప్‌లో ఉన్న జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ దశలో ఉన్న జట్లను రెండు గ్రూపులుగా చేర్చారు. మొదటి గ్రూప్‌లో గ్రూప్ A, D జట్లు ఉంటాయి. గ్రూప్ 2- B, C జట్లు ఉంటాయి. ప్రతి జట్టు ఇతర గ్రూపులోని జట్టుతో తలపడుతుంది. అర్హత సాధించిన జట్టుతో 2 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత.. సూపర్ సిక్స్ గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు జనవరి 31న జరగాల్సిన సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2 న జరుగుతుంది.
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
Read Also: iPhone: ఐఫోన్ ఈ మోడల్స్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు.. డిటేల్స్ ఇవే..!
2025లో జరిగే ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లు (ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్) ఈ పోటీలో పాల్గొంటుడగా.. మలేషియా నేరుగా ప్రవేశించింది. అలాగే.. నేపాల్, నైజీరియా, సమోవా, స్కాట్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ప్రాంతీయ టోర్నమెంట్లను గెలుచుకోవడంతో పోటీలో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి.
U19 మహిళల T20 WC 2025 కోసం భారత జట్టు:
నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), జి. త్రిష, కమలిని. జి (వికెట్ కీపర్), భావికా అహిర్ (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషితా విజె, సోనమ్ యాదవ్, పరిణీత సిసోడియా, కేసరి దృష్టి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, MD షబ్నం, వైష్ణవి.
రిజర్వ్ ప్లేయర్లు: నంధన, ఇరా జె, అనాది. టి.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!