Anand Mahindra: సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్.. లోకల్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. బిజినెస్ కార్యకలాపాల్లో బిజీగా ఉండడమే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను, ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. ఆసక్తికరమైన కామెంట్లు పెడుతుంటారు.. ముఖ్యంగా లోకల్ టాలెంట్‌ను వెలికి తీయడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో.. సిటీల్లో ఏదైనా కాస్త భిన్నమైంది ఆయనకు ఏదైనా కనిపిస్తే చాలా.. దానిని విడిచిపెట్టకుండా.. షేర్ చేసి.. తన అభిప్రాయాలను పంచుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం చేస్తుంటారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో.. ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.
Read Also: ED Raids: అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌పై ఈడీ రైడ్స్ .. ఆరోపణలు ఇవే..!
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
అయితే, ఇప్పుడు మహీంద్రా మరో కొత్త ట్యాలెంట్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లకు పరిచయం చేశారు.. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లపై ఫోకస్ పెరిగడం.. అవి కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతోన్న నేపథ్యంలో.. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం అంటూ రాసుకొచ్చారు.. కేవలం చిన్న డిజైన్ ఇన్‌పుట్‌లతో తయారు చేసిన ఈ వాహనం.. గ్లోబల్ అప్లికేషన్‌ను కనుగొనగలదు. రద్దీగా ఉండే యూరోపియన్ పర్యాటక కేంద్రాల్లో టూర్ ‘బస్సు’లా? నేను ఎల్లప్పుడూ గ్రామీణ రవాణా ఆవిష్కరణలతో ఆకట్టుకుంటాను.. ఇక్కడ అవసరం ఆవిష్కరణకు తల్లి.. అని పేర్కొన్నారు.. ఇక, ఆ వీడియోలో ఆ వాహనం తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది.. ఎన్ని కిలోమీటర్ల వరకు నడుస్తుందనే విషయాలను పంచుకున్నాడు ఆ బైక్ తయారు చేసిన యువకుడు.. ఆ వాహనాన్ని తయారుచేసేందుకు రూ.12,000 ఖర్చు అయ్యిందని.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని.. సదరు యువకుడు చెప్పుకొచ్చాడు.. అయితే, పొడవాటి సైకిల్‌లా ఉన్న ఆ వాహనం.. పెద్దసైజ్ బైక్‌లా కనిపిస్తోంది.. ఒకరి తర్వాత ఒకరు కూర్చేనే విధంగా సీట్లను ఏర్పాటు చేశారు.. మొత్తంగా ఆ వాహనానికి ఆనంద్ మహీంద్ర మాత్రమే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device could find global application. As a tour ‘bus’ in crowded European tourist centres? I’m always impressed by rural transport innovations, where necessity is the mother of invention. pic.twitter.com/yoibxXa8mx
— anand mahindra (@anandmahindra) December 1, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!