U19 Asia Cup 2024: మెరిసిన తెలంగాణ అమ్మాయి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్!
- ఆసియా కప్ 2024 విజేతగా భారత మహిళా జట్టు
- మహిళల జట్టు ప్రతీకారం
- తెలంగాణ అమ్మాయి త్రిషకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 ఆసియా కప్ 2024 విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్ అయింది. జువైరియా ఫెర్డోస్ (22) టాప్ స్కోరర్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన అండర్-19 ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇటీవలే అండర్-19 పురుషల ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటమికి మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కమిలిని (5), సానికా చల్కే (0) నిరాశపర్చారు. ఈ సమయంలో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (52).. కెప్టెన్ నికీ ప్రసాద్ (12)తో కలిసి జట్టును ఆడుకుంది. ఈ ఇద్దరు కలిసి 41 పరుగులు జోడించారు. నికీ అనంతరం ఐశ్వరి (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కాసేపటికే త్రిష కూడా పెవిలియన్‌కు చేరింది. మిథిలా (17), ఆయుషి శుక్లా (10) దూకుడు ఆది భారత్ స్కోరును 100 దాటించారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా 4 వికెట్స్ పడగొట్టింది.
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
ఛేదనలో భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ మహిళలు వరుసగా పెవిలియన్ చేరారు. జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మాత్రమే రెండెంకల స్కోర్ అందుకున్నారు. ఇవా, సుబోర్నా, సుమైయా అక్తర్, సైదా అక్తర్, జన్నతుల, హబిబా నిరాశపరిచారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, సిసోదియా 2, సోనమ్ యాదవ్ 2 వికెట్స్ పడగొట్టారు. హాఫ్ సెంచరీ చేసిన తెలంగాణ అమ్మాయి త్రిషకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?