అండర్-19 ఆసియా కప్ 2024 విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్ అయింది. జువైరియా ఫెర్డోస్ (22) టాప్ స్కోరర్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన అండర్-19 ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇటీవలే అండర్-19 పురుషల ఆసియా కప్ ఫైనల్‌లో…