India vs West Indies Test: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య నేటి (గురువారం) నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభం కానుంది. భారత గడ్డపై సాధారణంగా కనిపించే పరిస్థితులకు భిన్నంగా ఈ టెస్టు మ్యాచ్ సాగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ కండిషన్స్ పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భారత్‌కు ఇది తొలి హోమ్ సిరీస్. ఈ ఏడాది ఫైనల్ కు అర్హత సాధించని తర్వాత, భారత్ ఈసారి ఎలాగైనా ఫైనల్ చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌తో శుభ్‌మన్ గిల్ మొదటిసారి భారత గడ్డపై టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Ind A vs Aus A: గ్రౌండ్ ఏదైనా దబిడి దిబిడే.. మెరుపు సెంచరీలతో రెచ్చిపోయిన ఆర్య, అయ్యర్..
నరేంద్ర మోదీ స్టేడియంలో రెడ్ సాయిల్ పిచ్ ను ఎంచుకున్నారు. ఇది పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. అక్టోబర్ 2వ తేదీ, మొదటి రోజు, 84% వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు, మూడు రోజులు (శుక్ర, శని) వర్షానికి అవకాశం 25% మాత్రమే ఉన్నప్పటికీ, నాలుగు, ఐదవ రోజు (ఆది, సోమ) వర్షం పడే అవకాశం మళ్లీ 71% నుంచి 90% వరకు ఉండవచ్చు. అయితే, వర్షం రోజు మొత్తం కాకుండా మధ్యమధ్యలో మాత్రమే వస్తుందని, కాబట్టి మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. నేటి భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టులో ఆడే అంచనా ప్లేయింగ్ ఎలెవన్ జట్లు ఈ క్రింది విధంగా ఉండవచ్చు..
Gandhi Jayanthi: బాపూ ఘాట్ కు సీఎం..
భారత్ (Probable XI):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
వెస్టిండీస్ (Probable XI):
తేజనరైన్ చందర్‌పాల్, కెవ్లోన్ అండర్సన్, అలిక్ అతానాజ్, బ్రాండన్ కింగ్, షై హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్, జోమెల్ వార్రికన్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్