NTV Telugu Site icon

IND vs SL: చెలరేగిన భారత బ్యాటర్లు.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?

India Vs Sri Lanka

India Vs Sri Lanka

IND vs SL: పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్‌ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ జోడీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది.

Read Also: Aditya Birla Group: రూ.5000 కోట్ల ప్రణాళిక..రిలయన్స్-టాటాలకు ఆదిత్య బిర్లా గట్టి పోటీ?

యశస్వి, శుభ్‌మన్‌ల అవుట్‌ తర్వాత రిషబ్‌ పంత్‌తో కలిసి కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు కృషి చేశాడు. వెనువెంటనే రెండు వికెట్లు పడిన తర్వాత కూడా సూర్యకుమార్, పంత్ పరుగుల వేగాన్ని ఆపలేదు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా సూర్యకుమార్‌కి ఇదే తొలి టీ20 హాఫ్‌ సెంచరీ. ఈ విధంగా సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ దక్కిన వెంటనే.. ఇక ఆగేది లేదని తన వైఖరిని చాటుకున్నాడు. సూర్యకుమార్ 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 58 పరుగులు చేశాడు. పంత్ కూడా ధాటిగా ఆడుతూ 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) పతిరణ బౌలింగ్ లోనే అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.