India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, ఇప్పుడు నాలుగో టీ20 కోసం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో బరిలోకి దిగనుంది. అయితే ఈ చిన్న వేదికపై భారత్‌కు అజేయమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ప్రతిసారీ ఛేజింగ్‌లో భాకత్ సత్తా చాటుతూ మన జట్టు ఘనవిజయాలు సాధించింది. ఈ చిన్న మైదానం టీమిండియాకు అచ్చం సొంత మైదానంలా మారిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆక్లాండ్‌లో భారత్ ఆడిన మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ విజయాల జెండా పాతింది. ఇక్కడ మన జట్టు విజయాల రికార్డు వంద శాతంగా ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌ల వివరాలు పరిశీలిద్దాం..
మొదటి మ్యాచ్ (8 ఫిబ్రవరి 2019): ఈ వేదికపై ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో న్యూజిలాండ్ 158 పరుగులు చేసింది. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్యా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. రోహిత్ శర్మ (50), శిఖర్ ధావన్ (30), మూడో స్థానంలో వచ్చి అజేయంగా 40 పరుగులు చేసిన రిషబ్ పంత్, ధోనీ (20 నాటౌట్) రాణించడంతో భారత్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
- IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
రెండో మ్యాచ్ (24 జనవరి 2020): ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో, భారత్ 19 ఓవర్లలోనే 204 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ప్రస్తుత జట్టును నాయకత్వం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ మైదానం ఎంతో ప్రత్యేకమైనది.
మూడో మ్యాచ్ (26 జనవరి 2020): ఇదే వేదికపై జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 132 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 57 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ మరోసారి 33 బంతుల్లో 44 పరుగులు చేసి రాణించారు. దీంతో భారత్ 17.3 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇలా ఆక్లాండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఛేదన ద్వారానే విజయాలు సాధించింది. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటికే 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఆక్లాండ్‌లో తమ అజేయ రికార్డును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఈ చిన్న మైదానంలో టీమిండియా రికార్డు కివీస్ జట్టును భయపెడుతోంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా ఆ జట్టు ఓటమి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
ట్రెండింగ్
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!