IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టుకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
సాల్ట్ మెరుపులు:
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ 21 బంతుల్లో 36 పరుగులు చేయగా.. చివర్లో సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. భారత్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకోగా, హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు దక్కించుకున్నాడు. లగే అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసినా 49 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
భారత్ వరుస వికెట్ల పతనం:
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ మంచి శుభారంభం అందించారు. అయితే 1.5 ఓవర్ వద్ద అభిషేక్ శర్మ 10 పరుగులకు ఔటవడంతో తొలి దెబ్బ తగిలింది. రెండు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 5 బంతుల్లో 13 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10) వరుసగా పెవిలియన్ చేరడంతో భారత్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 53/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా తిలక్ వర్మ (3), శివమ్ దూబే (2), హర్షిత్ రాణా (9), అర్ష్‌దీప్ సింగ్ (4), వరుణ్ చక్రవర్తి (5) లు కూడా వరుసగా విఫలమవడంతో భారత ఇన్నింగ్స్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు, విల్ జాక్స్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ విజయాన్ని మరింత ఘనంగా మార్చారు.
సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం:
ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. తర్వాతి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న ఆతిథ్య జట్టు సిరీస్‌పై పట్టు బిగించింది. మరోవైపు భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
England win the 3rd T20I by 125 runs to lead the series 2-0.
Scorecard ▶️ https://t.co/jan4S8zsaV#TeamIndia | #ENGvIND pic.twitter.com/JKung77cru
— BCCI (@BCCI) July 7, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..