Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
- కామన్వెల్త్ గేమ్స్ 2026
- భారత్ ఖాతాలో మరో పతకం
- వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 65 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండి రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఫైనల్లో రాజా ముత్తుపాండి స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి 286 కిలోగ్రాముల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్‌కు మరో విలువైన పతకం లభించింది.
ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచిన మలేషియా క్రీడాకారుడు
ఈ విభాగంలో మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 299 కిలోగ్రాములు ఎత్తి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.
Also Read
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ఇక పాపువా న్యూ గినియాకు చెందిన మోరేయా బారు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. చివరి వరకు రాజా ముత్తుపాండితో గట్టి పోటీ ఇచ్చినా, భారత వెయిట్‌లిఫ్టర్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుని రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో వెయిట్‌లిఫ్టింగ్, పవర్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ మొత్తం నాలుగు పతకాలు సాధించింది.
ఎన్నో కష్టాల తర్వాత ఈ విజయం
రాజా ముత్తుపాండి క్రీడా ప్రయాణం సవాళ్లతో నిండింది. 2017లో యూత్ కామన్వెల్త్ గేమ్స్, జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2019లో లిగమెంట్ గాయం కారణంగా కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో చాలా కాలం పోటీలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 2021లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానం సాధించినప్పటికీ, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించలేకపోయాడు.
బలమైన పునరాగమనం
అయితే రాజా వెనక్కి తగ్గలేదు. కఠిన సాధనతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 2024లో 61 కేజీల విభాగంలో జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. అనంతరం 2025 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తన పునరాగమనాన్ని చాటిచెప్పాడు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలవడంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. తదుపరి లక్ష్యంగా లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించడమే తన ప్రధాన ధ్యేయంగా రాజా ముత్తుపాండి ముందుకు సాగుతున్నాడు.
భారత్‌కు మరో గర్వకారణం
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. రాజా ముత్తుపాండి సాధించిన ఈ రజత పతకం భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. అతని పట్టుదల, కష్టపడే తత్వం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి