Vaibhav Sooryavanshi ధనాధన్ ఇన్నింగ్స్ చూడలేకపోయారా.. మ్యాచ్ హైలెట్స్ చూసేయండి ఇక్కడ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో 15 ఏళ్ల ఈ యువ ఓపెనర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు. వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 35 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యి మరోసారి నిరాశ పరిచాడు. అయితే మరో ఎండ్‌లో నిలిచిన వైభవ్ సూర్యవంశీ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకున్నాడు. తొలి 10 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసిన అతడు.. ఆ తర్వాత క్రమంగా వేగం పెంచుతూ 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో అన్ని రకాల షార్ట్స్ కనిపించాయి. బ్రాడ్ ఎవాన్స్ వేసిన యార్కర్‌ను స్ట్రెయిట్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించడం, సికందర్ రజా బౌలింగ్‌లో 102 మీటర్ల భారీ సిక్స్ బాదడం అభిమానులను ఉర్రూతలూగించాయి. అలాగే వెస్లీ మధెవేరే బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టి తన వినూత్న షాట్ సెలక్షన్ ఇలా గ్రౌండ్ నలుమూలల బంతిని బౌండరీ లైన్ ను దాటించాడు.
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
వైభవ్ రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్ (29)తో కలిసి 75 పరుగుల భాగస్వామ్యం, అనంతరం శ్రేయస్ అయ్యర్ (27)తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. చివర్లో రింకూ సింగ్ 14 బంతుల్లో 25 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది.
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆదిలోనే భారీ షాక్ ఇచ్చారు. తొలి బంతికే మయాంక్ యాదవ్ బ్రియాన్ బెన్నెట్‌ను పెవిలియన్‌కు పంపగా.. యశ్ ఠాకూర్ ఒకే ఓవర్లో డియాన్ మైయర్స్, కెప్టెన్ సికందర్ రజాలను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. మయాంక్ యాదవ్ 3 వికెట్లు, యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీసి జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక దశలో ర్యాన్ బర్ల్ (54*) పోరాడినా.. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేంత మద్దతు మరో ఎండ్ నుంచి లభించలేదు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 157/7కే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ జింబాబ్వే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్, ఐర్లాండ్‌లపై వరుస సిరీస్ ఓటముల తర్వాత ఈ క్లీన్‌స్వీప్ భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
అయితే ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీలలో రాకపోవడంతో చాలామంది ఈ మ్యాచ్ ను వీక్షంచలేకపోయారు. అయినా ఏం పరవాలేదు. మ్యాచ్ పూర్తి హైలెట్స్ ఇక్కడ చూసేయండి.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!