Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వికెట్ అద్భుతంగా కనిపిస్తోందని, భారీ స్కోరు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా బ్రూక్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లో జో రూట్ ఆడిన ఇన్నింగ్స్ తమ జట్టుకు దిశా నిర్దేశం చేసిందని, అలాగే మిడిల్ ఓవర్లలో బౌలర్లు రాణించిన తీరును ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. సాకిబ్ స్థానంలో జోష్ టంగ్ జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిస్తే తాము కూడా మొదట బౌలింగే ఎంచుకోవాలని భావించామని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం భారత జట్టు ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అలాగే వాషింగ్టన్ సుందర్ మ్యాచ్‌కు ముందే గాయంతో అందుబాటులో లేకుండా పోగా, ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. లార్డ్స్ పిచ్ పరిస్థితులను బట్టి భారత్ నలుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో మంచి స్థితిలో ఉండి కూడా వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమి చెందామని, ఈసారి ఆ తప్పులు చేయకుండా 280-300 పరుగుల మార్కును అందుకోవడమే లక్ష్యమని గిల్ పేర్కొన్నాడు. ఈ పిచ్‌లపై పరుగులు చేయడం అంత సులభం కాదని అతను అభిప్రాయపడ్డాడు.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
మ్యాచ్ ప్రారంభం కాగా.. ఇంగ్లాండ్ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసి నిలకడగా ఆడుతోంది. భారత తుది జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులో బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ ఆడుతున్నారు. సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ మ్యాచ్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!