Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Prices: మద్యం బాటిళ్లపై నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టాస్మాక్ దుకాణాల్లో వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, సస్పెన్షన్లు ముమ్మరమైనట్లు సమాచారం.
మూడు రోజుల్లో 240 మందికి పైగా సస్పెన్షన్
అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ సూపర్వైజర్లు, సేల్స్‌మెన్, అసిస్టెంట్ సేల్స్మెన్లపై సస్పెన్షన్ వేట పడింది. కేవలం మూడు రోజుల్లోనే 240 మందికి పైగా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టాస్మాక్ దుకాణాలపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం బాటిళ్లపై ఎమ్మార్పీ కంటే అదనంగా నగదు వసూలు చేస్తే మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించనున్నట్లు అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. అదే తప్పును మరోసారి పునరావృతం చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు వసూళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
సస్పెన్షన్లపై టాస్మాక్ సిబ్బంది ఆందోళన
మరోవైపు ప్రభుత్వం చేపట్టిన సస్పెన్షన్లపై కొన్ని ప్రాంతాల్లో టాస్మాక్ సిబ్బంది నిరసనకు దిగారు. షాపులు మూసివేసి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. తప్పు చేయకపోయినా తమను సస్పెండ్ చేస్తున్నారని కొందరు సూపర్వైజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను పరిశీలించకుండా చర్యలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. అయితే, మద్యం బాటిళ్లపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎన్నికల సమయంలోనే ప్రచార అంశంగా మారితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని భావిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల నుంచి అదనపు వసూళ్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో టాస్మాక్ దుకాణాల్లో తనిఖీలు, సిబ్బందిపై చర్యలు మరింత వేగవంతమయ్యాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!