Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ రంగంలో దొంగలు ఉన్నా జరిగే నష్టం కంటే.. గురువుల్లో అక్రమాలకు పాల్పడేవారు ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయుల్లో అక్రమాలు జరిగితే భవిష్యత్తు సమాజానికే ప్రమాదమని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కావాలనే తీసుకున్నారని, విద్యావ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిని ప్రోత్సహించారని పేర్ని నాని ఆరోపించారు. స్కామ్‌లు చేసి డబ్బులు సంపాదించేందుకే విద్యాశాఖను తీసుకున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారనే కారణంతో తమకు అనుకూలమైన వారిని టీచర్లుగా నియమించారని ఆరోపించారు.
అన్ని శాఖల్లోనూ లోకేష్ పెత్తనం కొనసాగుతోందని, రాష్ట్రంలో సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. లోకేష్ నెలకోసారి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తనతో చర్చకు వస్తానని సవాల్ చేసిన లోకేష్.. తాను ఆధారాలతో వస్తుంటే చర్చ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్ని నాని అన్నారు. నిన్నటి వరకు ప్రగల్భాలు పలికిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ‘డీఎస్సీ అంటే టీడీపీ’ అని గతంలో చెప్పారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే మీ డీఎస్సీనా అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలోనే కాకుండా వికలాంగుల కోటాలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓసీ, బీసీ కేటగిరీల్లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు ఇచ్చారని, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారికి కూడా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
పదుల సంఖ్యలో ఫేక్ టీచర్లు?
ఒక్కరు, ఇద్దరు కాకుండా పదుల సంఖ్యలో నకిలీ ఉపాధ్యాయులు బయటపడుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇక చర్చలతో కాలయాపన చేయకుండా సమగ్ర విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆధారాలతో అక్రమాలు బయటపడిన తర్వాత కూడా చర్చలు ఎందుకని ప్రశ్నించారు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. చర్చల అంకం ముగిసిందని, ఇక విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణ.. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు తమ ఉద్యమం ఆగదని పేర్ని నాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!