Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand 2026: న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లే టీమిండియా జట్టు ఎంపికలో భారీ మార్పులే జరిగాయి. ఆ దేశంలో భారత జట్టు సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. భారత్ తాజాగా జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. టీమ్స్‌లో ఐదు వన్డేలకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం గమార్హం. మరోవైపు.. టెస్టు జట్టులోకి పేసర్ ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్ మళ్లీ వచ్చారు. లోయర్ బ్యాక్‌లో స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి కోలుకున్న ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చాడు. 2025లో ఇంగ్లాండ్ టూర్లో అద్భుతంగా రాణించిన అతను, ఇప్పుడు మళ్లీ అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లాండ్‌లో టెస్టు అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే, గుర్నూర్ సింగ్ బ్రార్‌కు మాత్రం టెస్టు జట్టులో చోటు దక్కలేదు. వీరు కాకుండా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా టెస్టు స్క్వాడ్‌లో ఉన్నాడు కానీ, అతని ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎడమ పక్కటెముక గాయం నుంచి అతను కోలుకుంటున్నాడు.
మరోవైపు బుమ్రా విషయంలో మేన్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం టెస్టు సిరీస్‌లో మాత్రమే ఆడనున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మోకాలి గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన గత సిరీస్‌కు దూరమైన బుమ్రా, ఆ తర్వాత టీ20ల ద్వారా తిరిగి వచ్చి జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేసి సుదీర్ఘ ఫార్మాట్ కోసం తన ఫిట్నెస్ను మరింత పెంచుకోనున్నాడు.
Also Read
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
ఇక, వన్డే సిరీస్‌కు సంబంధించి కెప్టెన్సీలోనూ మార్పులు చేశారు. తొలి మూడు వన్డేలకు శుభమన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత అతను టెస్టు క్రికెట్ ప్రిపరేషన్స్‌పై దృష్టి పెట్టనున్నాడు. దాంతో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించనున్నాడు. కెఎల్ రాహుల్ కూడా మూడో వన్డే తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. 2025 డిసెంబర్ తర్వాత తొలిసారి తిలక్ వర్మ వన్డే జట్టులోకి రాగా, యువ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర తొలిసారిగా భారత జట్టులో స్థానం సంపాదించాడు. అయితే సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను మాత్రం వన్డే జట్టు నుంచి తప్పించారు.
ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 22 నుంచి టీ20 మ్యాచ్‌లతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో క్రైస్ట్‌చర్చ్‌లో తొలి రెండు టీ20లు, అక్టోబర్ 27న వెల్లింగ్టన్లో మూడోది, అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో నాలుగోది, నవంబర్ 1న హామిల్టన్‌లో ఐదో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. తొలి వన్డే నవంబర్ 4న ఆక్లాండ్‌లో, రెండోది నవంబర్ 7న వెల్లింగ్టన్లో, మూడోది నవంబర్ 10న హామిల్టన్‌లో, అలాగే నాలుగు, ఐదు వన్డేలు నవంబర్ 13, 15 తేదీల్లో మౌంట్ మాంగనుయ్‌లో నిర్వహిస్తారు. ఇక చివరగా నవంబర్ 19 నుంచి టెస్టు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి టెస్టు నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్లో, రెండో టెస్టు నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతాయి.
తొలి మూడు వన్డేలకు జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
చివరి రెండు వన్డేలకు జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబి, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, మొహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
టెస్టు జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధ्रुవ్ జురెల్, రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!