India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra Explains India vs Japan Controversial Wide Call: భారత్, జపాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ సేన 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. ఆపై జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో చోటుచేసుకున్న ఓ వివాదాస్పద వైడ్ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తొలుత వైడ్‌గా ప్రకటించిన బంతిని ఆ తర్వాత అంపైర్ వెనక్కి తీసుకోవడంతో.. భారత్ గెలుపు కోసం ‘చీటింగ్’కు పాల్పడిందంటూ నెటిజెన్స్ విమర్శలు చేశారు.
జపాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ వేసిన బంతి లెగ్‌స్టంప్ వైపు వెళ్లింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్ ఆ బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. తొలుత అంపైర్ వైడ్‌గా ప్రకటించినప్పటికీ.. అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బంతి వైడ్ కాదని అంపైర్ ప్రకటించాడు. ప్రస్తుత ఐసీసీ నిబంధనల ప్రకారం.. బ్యాటర్ రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ తరహాలో తన స్టాన్స్‌ను మార్చుకుని షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తే, ఆ మార్పును పరిగణనలోకి తీసుకుని వైడ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగానే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మాజీ భారత క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వివరించాడు.
Also Read
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
అంపైర్ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపింది. వైడ్‌గా ప్రకటించిన నిర్ణయం కొనసాగి ఉంటే.. జపాన్‌కు విజయం సాధించేందుకు అవకాశాలు మరింతగా ఉండేవి. అయితే అంపైర్ నిర్ణయం మారడంతో.. జపాన్ ఆరు పరుగులను మూడు బంతుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి భారత్ రెండు పరుగుల తేడాతో ఊహించని విజయం సాధించింది. తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వివాదంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. భారత్ చీటింగ్ చేసిందంటూ వస్తున్న విమర్శలను ఖండించాడు. ‘వైడ్ నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో జపాన్ను భారత్ చీటింగ్ చేసి గెలిచిందని కొందరు అంటున్నారు. భారత జట్టు అంపైర్‌పై ఒత్తిడి తెచ్చిందని, అందుకే నిర్ణయం మార్చారని చెబుతున్నారు. కానీ అసలు విషయం నిబంధనల్లో ఉంది’ అని చోప్రా పేర్కొన్నాడు.
‘తొలుత నాకు కూడా ఈ నిబంధనపై పూర్తి అవగాహన లేదు. స్విచ్ హిట్ ఆడినప్పుడు మాత్రమే వైడ్ లైన్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధన వర్తిస్తుందని, రివర్స్ స్వీప్‌కు వర్తించదని నేను మొదట భావించా. అలాగే బంతి వేయడానికి ముందు బ్యాటర్ తన స్టాన్స్‌ను మార్చాడా లేదా అనే అంశం కూడా ముఖ్యమని అనుకున్నా. కానీ ఐసీసీ కొత్త నిబంధనలను పరిశీలించిన తర్వాత నా అవగాహన కూడా తప్పేనని స్పష్టమైంది. కొత్త ఐసీసీ నిబంధనల ప్రకారం స్విచ్ హిట్, రివర్స్ స్వీప్‌లను వేర్వేరుగా చూడరు. బ్యాటర్ తన స్థానాన్ని మార్చుకుని షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు ఆ మార్పును నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
అంతేకాకుండా బౌలర్ బంతిని చేతిలో పట్టుకున్న సమయంలో బ్యాటర్ స్టాన్స్ మార్చాడా, బంతిని విడుదల చేసిన తర్వాత మార్చాడా అనే తేడా కూడా ఉండదని చోప్రా పేర్కొన్నాడు. బ్యాటర్ తన పొజిషన్ మార్చుకున్నట్లుగా పరిగణిస్తారని, అలాంటి సందర్భంలో నిబంధనల ప్రకారం బౌలర్‌కు ప్రయోజనం కలుగుతుందని వివరించాడు. ‘ఐసీసీ కొత్త నిబంధనలను పరిశీలించాను. అంపైర్ల వివరణ కూడా విన్నాను. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ రెండింటినీ నిబంధనల్లో ఒకే విధంగా చూస్తున్నారు. బ్యాటర్ తన పొజిషన్‌ను ఎప్పుడు మార్చాడన్నది కూడా కీలకం కాదు. కుడిచేతి వాటం, ఎడమచేతి వాటం బ్యాటర్‌గా రెండు రకాలుగా పరిగణించబడవచ్చు. అందువల్ల బౌలర్‌కు ప్రయోజనం లభిస్తుంది’ అని చోప్రా వివరించాడు. భారత్-జపాన్ మ్యాచ్‌లో వివాదాస్పదంగా మారిన వైడ్ నిర్ణయం వెనుక నిబంధనలు ఉన్నాయని చోప్రా స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..