Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- జనాభా పెంచేందుకు కొత్త ఆలోచన
- మూడో బిడ్డకు రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kutch Kadwa Patidar Samaj Announces Third Child Incentive: సాధారణంగా చిన్న కుటుంబం, ఇద్దరు పిల్లల నినాదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే గుజరాత్లోని ఓ సామాజిక వర్గం మాత్రం తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భిన్నమైన నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో మూడో బిడ్డ పుడితే ఆ శిశువు పేరుతో రూ.50,000 ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేయనున్నట్లు కచ్ కడ్వా పటిదార్ సమాజం ప్రకటించింది.
సూరత్లోని కడోదరాలో జరిగిన కచ్ కడ్వా పటిదార్ సమాజం దక్షిణ గుజరాత్ జోన్ వార్షిక సమావేశంలో ఈ ‘బాల ప్రోత్సాహన్ యోజన’ను ప్రకటించారు. ఈ పథకం ప్రకారం కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే.. ఆ బిడ్డ అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అతని లేదా ఆమె పేరుతో రూ.50,000 FD చేయనున్నారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి చేయనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
ఎందుకు ఈ నిర్ణయం?
కచ్ కడ్వా పటిదార్ సమాజంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాజ ప్రతినిధులు తెలిపారు. యువ దంపతుల్లో కొందరు ఒక్క బిడ్డకే పరిమితం కావడం లేదా పిల్లలు వద్దనే నిర్ణయం తీసుకోవడం వంటి ధోరణిపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. మూడో బిడ్డను కనడానికి కుటుంబాలను ప్రోత్సహించడం, సమాజంలో జనాభా సమతుల్యతను కొనసాగించడం ఈ పథకం ఉద్దేశంగా సమాజ నాయకులు పేర్కొన్నట్లు వార్తా నివేదికలు తెలిపాయి.
మూడో బిడ్డకు ఆర్థిక ప్రోత్సాహంతో పాటు, ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులను ప్రజా కార్యక్రమంలో సన్మానించాలనే ప్రతిపాదన కూడా చేసినట్లు సమాచారం. సమాజంలోని యువ దంపతుల్లో పెద్ద కుటుంబాలపై ఆసక్తి పెంచేందుకు ఈ విధమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ గుజరాత్లో కచ్ కడ్వా పటిదార్ సమాజానికి సుమారు 17,000 మంది జనాభా ఉన్నట్లు అందిన నివేదికలో పేర్కొన్నారు. జనాభా క్రమంగా తగ్గుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై సమాజ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సమాజంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రతినిధులు తెలిపారు.
మూడో బిడ్డ విషయంలో లింగభేదం లేదు
ఈ పథకంలో మరో అంశం ఏమిటంటే.. మూడో సంతానం అబ్బాయి లేదా అమ్మాయి అనే తేడా లేకుండా ప్రయోజనం అందించనున్నారు. అంటే మూడో బిడ్డగా పుట్టే శిశువు పేరుతోనే రూ.50,000 FD చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ పథకం ఒక సామాజిక సంస్థ తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, ఇది గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ పథకం కాదని గమనించాలి.
తాజావార్తలు
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..