PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఓ ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. త్వరలోనే 2000 రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. మీ ఈ-కేవైసీ (eKYC) గనక పూర్తవ్వకపోతే మాత్రం ఈసారి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడవు. గతంలో వచ్చిన 23వ విడత సమయంలో కూడా ఈ-కేవైసీ పూర్తికాని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ (pmkisan.gov.in)లో సాధారణ రైతులకు డైరెక్ట్‌గా ఈ-కేవైసీ చేసుకునే ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో చాలామంది రైతులు ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలా అని కంగారు పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు, దీనికి మూడు సులువైన మార్గాలు ఉన్నాయి. అలాగే ఊర్లోకి వచ్చి ఈ-కేవైసీ చేస్తామని డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
మొదటి మార్గం ఏంటంటే..?
మీ ఊరిలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రానికి వెళ్లండి. పీఎం కిసాన్ పోర్టల్‌లో సాధారణ రైతులకు ఈ-కేవైసీ ఆప్షన్ లేకపోయినా, సిఎస్సి కేంద్రాల విఎల్ఈ (VLE) లాగిన్‌లో ఆ సదుపాయం ఉంటుంది. మీరు మీ ఆధార్ కార్డు, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తీసుకుని సిఎస్సి కేంద్రానికి వెళ్తే, అక్కడ బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేస్తారు. అయితే దీనికి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము మాత్రమే ఇవ్వండి, అంతకుమించి ఎక్కువ డబ్బులు ఇవ్వకండి.
Also Read
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
మొబైల్ ద్వారానే ఈ కేవైసీ..
మొబైల్లో ముందుగా ప్లే స్టోర్ నుంచి ‘PM Kisan’ యాప్, ‘Aadhaar Face RD’ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోండి. పీఎం కిసాన్ యాప్‌ను ఓపెన్ చేసి, భాషను ఎంచుకుని లాగిన్ రకంలో ‘Beneficiary’ అని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వగానే ఫేషియల్ ఈ-కేవైసీ (Facial eKYC) ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నిబంధనలకు అంగీకరిస్తూ ఫేస్ స్కాన్ సెలెక్ట్ చేసి, మీ ముఖాన్ని మొబైల్ కెమెరాలోని సర్కిల్ లోపల స్పష్టంగా ఉంచాలి. ఆ లైన్లు గ్రీన్ కలర్లోకి మారగానే స్కాన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఒక mPIN క్రియేట్ చేసుకుని పీఎం కిసాన్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి ‘eKYC Status’ చెక్ చేసుకుంటే, అక్కడ ‘Yes’ అని వస్తే మీ ఈ-కేవైసీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయినట్లే.
ఇక మూడో మార్గం..?
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాగిన్ల ద్వారా పూర్తి ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు. మీ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అధికారులు లేదా సిబ్బంది వద్ద ఉండే స్పెషల్ లాగిన్ ఐడీల ద్వారా కూడా మీ ఈ-కేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. చివరగా ఒక ముఖ్యమైన హెచ్చరిక.. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేస్తామంటూ వచ్చి అమాయక రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి నకిలీ వ్యక్తులను అస్సలు నమ్మకండి, వారికి డబ్బులు ఇవ్వకండి. అసలు మీకు ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదో ముందుగా మీ మొబైల్లో లేదా సిఎస్సి కేంద్రంలో సరిచూసుకుని, కేవలం పైన పేర్కొన్న అధికారిక మార్గాల్లో మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి.
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!