Site icon NTV Telugu

India- Pakistan: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్..

India

India

కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్‌ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ వెల్లడించారు. పాకిస్థాన్‌తో కాశ్మీర్‌కు ఉన్న ఏకైక సంబంధం చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భూభాగాన్ని ఖాళీ చేయడమేనని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా తీవ్రంగా స్పందించారు. భారతదేశం ఇప్పటికైనా సత్యాన్ని అంగీకరించి, పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలనే ఆశను వదులుకోవాలని సూచించారు.

READ MORE: Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?

పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నారు?
ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు. ‘‘విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ పిల్లలకు పాక్‌ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంది’’ అని మాట్లాడారు. కశ్మీర్‌పై నోరు పారేసుకున్న మునీర్.. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు.

Exit mobile version