కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది.