IND vs PAK: పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Semis Scenario in Under-19 Asia Cup: ఆసియా అండర్ -19 ఆసియాకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్-ఎ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఇక భారత్ సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం యువ భారత్ ఆశలు అడియాశలవుతాయి. భారత్, నేపాల్ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో జరగనుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉదయ్ సహరన్ (60; 5 ఫోర్లు), సచిన్ దాస్ (58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లు పాక్ బౌలర్ల ధాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ జీషన్ నాలుగు వికెట్స్ పడగొట్టగా.. అమీర్ హసన్, ఉబైద్ షాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
Also Read: Vrinda Dinesh: అమ్మకు వీడియో కాల్ కూడా చేయలేకపోయా: వ్రిందా
అనంతరం పాకిస్తాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్ అవైస్ (105 నాటౌట్; 10 ఫోర్లు) సెంచరీ బాదాడు. షాజైబ్ ఖాన్ (63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాద్ బేగ్ (68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. మురుగన్ అభిషేక్ రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో పాటు గ్రూప్-ఏలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఇది రెండో విజయం. నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!