Today Gold and Silver Rates: గత కొద్దీ కాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు భారీగా తగ్గి ఆ తర్వాత రెండు రోజులు స్థిరంగా కొనసాగింది. అయితే , నేడు (మంగళవారం) దేశ వ్యాప్తంగా స్వల్ప పెరుగుదల కనిపించింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై రూ. 110 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80 పెరిగి రూ. 58,420గా ఉంది.
Also Read: One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
మరోవైపు, వెండి ధర మాత్రం రెండు రోజులు భారీగా తగ్గిన వెండి.. రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే మంగళవారం కూడా వెండి ధరలలో ఎలాంటి మార్పులు కనపడలేదు. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేజీ వెండి ఒక లక్షగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో మాత్రమే కిలో వెండి రూ.92,500గా కొనసాగుతోంది.