India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర ఆరోపణలపై భారత్ ఆందోళన
- నిందితుడిపై తగిన చర్యలు తీసుకుని, న్యాయస్థానం ముందు నిలబెట్టాలన్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US: అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను జాత్యాంకార, భారత వ్యతిరేక ద్వేషంగా అభివర్ణించింది. యూఎస్‌లో భారత ద్వేషం పెరుగుతోందనే ఆందోళనల్ని ఈ ఘటన పెంచుతోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చికాగో సమీపంలోని అరోరా ప్రాంతంలో హిందూ ఆలయాన్ని లక్ష్యగా చేసుకుని కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ కేసులో అమెరికా అధికారలుు తీసుకున్న చర్యలు, నిందితుడి అరెస్ట్, అతడిపై అభియోగాలను భారత్ గమనించిందని ఆయన చెప్పారు. ఈఘటనపై అమెరికా అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని భారత్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో భారతీయుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
అమెరికా అధికారుల ప్రకారం.. పాలటైన్‌కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే 19 ఏళ్ల యువకుడు ఈ కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పాపోరాకిస్ మాస్ షూటింగ్‌కు కుట్ర పన్నుతున్నట్లు మరో వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి పత్రాలు, రైఫిల్, మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్‌తో వస్తోంది!
-
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..