India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!

India Playing Xi Vs Wi

India Playing Xi Vs Wi

India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్‌ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది.

Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?

జింబాబ్వేతో జరిగిన గత మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపిన నిర్ణయం మంచి ఫలితాలను అందించింది. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. ఇందులో ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ (55) హాఫ్ సెంచరీతో సూపర్ టచ్ లోకి రావడం భారత్‌ కు పెద్ద ప్లస్ పాయింట్. దీన్ని బట్టి విండీస్‌ పై కూడా వీరిద్దరే ఇన్నింగ్స్ మొదలు పెట్టవచ్చు. ఇక మూడో స్థానంలో ఇషాన్ కిషన్, ఆపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు రానున్నారు.

అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ వరుసలో ఓ కీలక మార్పు చర్చనీయాంశంగా మారింది. జింబాబ్వేపై తిలక్ వర్మ 16 బంతుల్లో 44 పరుగులు చేసి అదరగొట్టినప్పటికీ.. జట్టుకు లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్ అవసరం ఎక్కువగా ఉంది. టీం కారణాల వల్ల గత మ్యాచ్‌ కు దూరమైన రింకూ సింగ్ విండీస్ వంటి జట్లపై చివర్లో భారీ సిక్సర్లు కొట్టి ఫినిషర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. అలాగే మరో మార్పు గమనించినట్లతే.. గత మ్యాచ్ లో పేలవంగా బౌలింగ్ చేసిన శివమ్ దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవచ్చు.

IND vs WI: భారత్ vs వెస్టిండీస్ హెడ్ టు హెడ్ రికార్డులు..

భారత బౌలింగ్ ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అతనికి తోడుగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సహకరిస్తున్నాడు. శివం దూబే వేస్తున్న మీడియం పేస్ బౌలింగ్ భారీగా పరుగులు ఇస్తుండటం మేనేజ్మెంట్‌ను కలవరపెడుతోంది. అలాగే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తమ లయను అందుకోవాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, బ్యాటింగ్ డెప్త్ తగ్గకూడదనే ఉద్దేశంతో భారత్ ప్రస్తుత కాంబినేషన్‌నే కొనసాగించే ఛాన్స్ ఉంది.

వెస్టిండీస్‌పై భారత్ ప్లేయింగ్ XI (అంచనా):
సంజూ సామ్‌సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ / రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే / వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.