NTV Telugu Site icon

India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..

Ind Vs Pak

Ind Vs Pak

పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది. ఇక, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్‌తో వాణిజ్యాన్ని త్వరలోనే పునరుద్ధరించవచ్చని సూచించారు. పాకిస్థానీ వ్యాపారవేత్తలు భారత్‌తో వ్యాపారం చేయాలనుకుంటున్నారు.. పాక్ సర్కార్ వ్యాపారవేత్తలతో మాట్లాడటం ద్వారా దీనికి సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్‌తో వాణిజ్యం పునః ప్రారంభించాలనే చర్చ మొదలైంది. భారత్‌తో సంబంధాలను పెట్టుకుని.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు.

Read Also: Srungavarapu Kota: ఆ నియోజకవర్గం టీడీపీలో కుంపటి.. ఇండిపెండెంట్‌గా బరిలోకి..!

ఇక, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ ను దూరం పెట్టింది. ఆ ఉగ్రవాద ఘటనలో పాకిస్తానీ గ్రూపు జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు మన దేశానికి చెందిన ఆర్మీ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత పాకిస్థాన్‌కు ఉన్న ఎంఎఫ్‌ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుంది. అలాగే, 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అప్పటి నుంచి పాకిస్థాన్ భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను క్యాన్సిల్ చేసుకుంది. అయితే, పాక్ దిగుమతులపై భారత్ 200 శాతం సుంకం విధించడమే కారణమని చెబుతున్నారు.

Read Also: Fire In Temple: ఆలయంలో పెను ప్రమాదం.. హారతిలో మంటలు ..12మందికి గాయాలు

అలాగే, భారత్‌తో వాణిజ్యం ఆగిపోవడంతో పాకిస్థాన్ సుదూర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని కారణంగా ఇప్పటికే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు మరింత తగ్గిపోతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం పునఃప్రారంభానికి సంబంధించి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచనలు చేసినట్లు తెలుస్తున్నప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఇక, పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం ఇండియాతో వాణిజ్య వ్యాపారం కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొత్త పాలసీని రూపొందిచినట్లు సమాచారం.

Show comments