India-Pakistan Match: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రెండు దేశాల మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో తమవారిని కోల్పోయిన బాధితులు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
US General: అమెరికాకు భారత్, పాకిస్తాన్ ఒకటే అని చెప్పకనే చెప్పింది. అమెరికు చెందిన ఒక టాప్ జనరల్ మాట్లాడుతూ.. వాషింగ్టన్‌కు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై అమెరికా పోరాటానికి ఆ ప్రాంతంలో భాగస్వామిగా పాకిస్తాన్ ఖచ్చితంగా అవసరమని అన్నారు.
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది.
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.