India Stops Buying Russian Oil: అగ్రరాజ్యం సుంకాల ఒత్తిడికి భారతదేశం తలొగ్గి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటదనే.. ప్రస్తుతం ఎంతో మంది మదిలే మెదిలే ప్రశ్న. మాస్కో నుంచి అత్యధికంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న సాకు చూపెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై 50% సుంకాలు విధించారు. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చాలా మందికి వచ్చే ఉంటాయి.. ఒక వేళ జనాల ఆలోచలను నిజం చేస్తూ ఇండియా చమురు కొనుగోలు నిలిపిస్తే.. తర్వాత దేశంపై ఈ నిర్ణయ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: War 2: ‘వార్ 2’ చూసి, ఆపుకోండి… హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
ఎంత చమురు దిగుమతి అవుతుంది..
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ డేటాను పరిశీలిస్తే.. జూన్ 2025 నాటికి, రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే మూడు దేశాలు భారత్, చైనా, టర్కీ. వీటిలో ఇండియా రెండవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. చైనా 47%, భారతదేశం 38%, టర్కీ 6%, EU 6% దిగుమతులు చేసుకుంటున్నాయి. భారతదేశ చమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.
2018లో భారత్ మొత్తం దిగుమతి చేసుకున్న చమురులో రష్యన్ చమురు వాటా కేవలం 1.3 శాతం మాత్రమే. అదే 2024 – 2025 సంవత్సరంలో ఇండియా ముడి చమురు దిగుమతుల్లో రష్యన్ చమురు వాటా 35 శాతానికి పైగా పెరిగింది. ICRA నివేదికల ప్రకారం.. భారతదేశం రాయితీ చమురును కొనుగోలు చేయడం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో $5.1 బిలియన్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో $8.2 బిలియన్ల దిగుమతి బిల్లులను ఆదా చేసుకుంది.
చమురు కొనడం మానేస్తే దాని ప్రభావం..
ట్రంప్ ఒత్తిడితో ఇండియా చమురు కొనుగోలును ఆపివేస్తే, అది ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, దౌత్యం, దేశీయ ద్రవ్యోల్బణం వంటి అనేక స్థాయిలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన ఖర్చులు.. ద్రవ్యోల్బణం పెరుగుతాయి: భారతదేశం 2022 నుంచి రష్యా ద్వారా భారీ తగ్గింపు రేటుకు చమురును కొనుగోలు చేస్తోంది. ఈ చమురు కొనుగోలు చేయడం నిలిపివేస్తే, మధ్యప్రాచ్యం – సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫ్రికా నుంచి చమురును దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. ఈ దిగుమతి ప్రక్రియ ఖరీదైనది అవుతుంది. దీని కారణంగా దేశంలో పెట్రోల్ – డీజిల్, రవాణా, ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు – వాణిజ్య లోటు: ఖరీదైన చమురు కొనుగోలు చేయడం వల్ల దిగుమతి బిల్లు పెరుగుతుంది. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) ను కూడా పెంచుతుంది. అలాగే రూపాయిని బలహీనపరుస్తుంది. RBI డాలర్లను అమ్మడం ద్వారా రూపాయికి మద్దతు ఇవ్వవలసి ఉంటుంది, ఇది దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలను తగ్గిస్తుంది.
దౌత్యపరమైన ఓటమి: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి చిహ్నంగా భావిస్తున్నారు. ఇండియా – మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేస్తే.. భారత్ ఒత్తిడికి తలొగ్గిందని ప్రపంచానికి సందేశం అందుతుంది. అదే సమయంలో రష్యాతో రక్షణ, ఇంధన భాగస్వామ్యం ప్రభావితమవుతుంది. ఈ పరిణాల మధ్య చైనా, రష్యాకు మరింతగా దగ్గరకు రావచ్చు. ఇది భారతదేశానికి భౌగోళిక, రాజకీయ ముప్పును పెంచుతుంది.
ఇంధన భద్రత తగ్గుతుంది: భారతదేశం ఇప్పుడు రష్యాతో పాటు మధ్యప్రాచ్య దేశాల నుంచి కూడా చమురును కొనుగోలు చేస్తుంది. గతంలో ఉన్నంత స్థాయిలో కాకుండా ప్రస్తుతం భారత్, మధ్యప్రాచ్యంపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఏదైనా ఉద్రిక్తత లేదా భద్రతా సంక్షోభం తలెత్తిన ఇండియాలో చమురు ధరలు పెద్దగా ప్రభావితం కావు. కానీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేస్తే, అప్పుడు మళ్లీ చమురు సరఫరా కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఇది దేశంలో ఇంధన భద్రత ప్రమాదాన్ని పెంచుతుంది.
అమెరికాను కూడా ప్రభావితం చేస్తుందా..
రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి ఇండిపెండెంట్ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నరేంద్ర తనేజా ఓఅంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడం అంటే ప్రపంచ సరఫరా వ్యవస్థ అకస్మాత్తుగా అదృశ్యం కావడమేనని అన్నారు. ఏ మార్కెట్ కూడా ఈ డిమాండ్‌ను తీర్చలేకపోతుందని అభిప్రాయపడ్డారు. దీని వల్ల చమురు ధరలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొ్న్నారు. దీని ప్రభావం అమెరికాపై కూడా ఉంటుందని, అది ఎంత మేరకు అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని చెప్పారు.
READ MORE: shocking incident from Bihar: బీహార్‌లో దారుణం.. స్తంభానికి కట్టేసి ఛీ..