ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత్ వేదికగా జరుగనుంది. అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ అయ్యే ఈ వన్డే ప్రపంచక్ కప్ లో 10 టీమ్స్ పోటీపడబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టు హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. ఇక, తాజాగా పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు. టీమిండియా చాలా మంచి జట్టు.. అయితే బెస్ట్ మాత్రం కాదంటూ ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: Eshwar: స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి
టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలంటే మాత్రం మ్యాచ్ విన్నర్లు కావాలి.. ద్వైపాక్షిక సిరీసుల్లో వాళ్లు బాగా ఆడుతున్నారు. ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చే సరికి ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ వాళ్ల దగ్గర వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన టీమ్ లేదు.. జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని, రీఎంట్రీ ఇస్తున్నాడు.. అతను వరల్డ్ కప్ మొత్తం ఆడగలడా?.. ఇంతకు ముందు చూపించిన ఇంపాక్ట్ చూపించగలడా? అంటూ ప్రశ్నించాడు.
Read Also: Reshma Prasad: అవును.. అవకాశాల కోసం వారితో.. నేను కూడా పడుకున్నాను
టీమిండియాకి చాలా సమస్యలు ఉన్నాయి.. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేరు.. టాపార్డర్‌లో రోహిత్, విరాట్ తప్ప మిగిలిన ప్లేయర్లకు అనుభవం లేదు అంటూ మహ్మద్ హఫీజ్ అన్నారు. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తేలిపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నాడు. ఐసీసీ టైటిల్ గెలిచి పదేళ్లు గడుస్తున్నా.. వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన టీమ్‌ని వాళ్లు ఇప్పటి వరకు తయారుచేయలేకపోతున్నారు.. మెగా ఈవెంట్లలో బాగా ఆడాలంటే ప్లేయర్ల మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అని ఈ పాక్ ఆల్ రౌండర్ అన్నారు.
Read Also: BCCI: వయాకామ్18కి బీసీసీఐ మీడియా రైట్స్..
ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్లేయర్లను టీమ్‌లోకి బీసీసీఐ తీసుకుంటుంది. వాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అదే రకమైన ప్రదర్శన ఇవ్వలేరు.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వంటి హై ఓల్టేజీ మ్యాచుల్లో ఐపీఎల్ ఆడిన అనుభవం ఎందుకూ పనికి రాదు అన్నారు. ప్రతీ ప్లేయర్ పై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. దీంతో వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ విషయంలో పాక్ ప్లేయర్లు చాలా బెటర్.. టీమిండియా ప్లేయర్లకు వచ్చినంత సోషల్ మీడియ అటెన్షన్ మాకు రాదు అని మహ్మద్ హఫీజ్ అన్నారు.