Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Monsoon 2026 Early Arrival Rain Forecast Ecmwf Update

Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!

Published Date :April 24, 2026 , 1:10 pm
By Suresh Maddala
  • రుతుపవనాల రాకపై తీపికబురు
  • వర్షాలు కురిసే సమయం ప్రకటన
  • అన్నదాతలకు.. ప్రజలకు శుభపరిణామం
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ఠారెత్తిస్తున్నాడు. మధ్యాహానానికి సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ నెల కూడా ముగిసిపోతుంది. మే నెల రాబోతుంది. రోహిణి కార్తె వస్తుందంటే పరిస్థితులు ఎలా ఉండబోతాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ నుంచి గుడ్‌న్యూస్ వచ్చింది.

ఈ ఏడాది ముందుగానే భారతదేశంలోకి రుతుపవనాలు ప్రవేశించొచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) తాజాగా అంచనా వేసింది. వేడి ఉపశమనం నుంచి త్వరగానే ఉపశమనం పొందవచ్చని అభిప్రాయపడింది. మే నెలాఖరు సమయానికి వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ పరిణామం అన్నదాతలకు, ప్రజలకు శుభ పరిణామంగానే చెప్పొచ్చు.

Also Read

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

2025లో కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మే 27-29 తేదీల్లో వర్షాలు కురవవచ్చని మౌసమ్ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లో అనుకున్న సమయం కంటే ముందే వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మే 18-25 మధ్యన అండమాన్-నికోబార్ దీవుల్లో రుతుపవనాలు చేరుకోవచ్చని చెప్పారు.

ప్రస్తుతం నైరుతి దిశ నుంచి వీచే బలమైన గాలులు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంపై బలపడుతున్నాయని దేవేంద్ర త్రిపాఠి సూచించారు. ఈ గాలుల కారణంగా ఆ వారంలో ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీనివల్ల సాధారణం కంటే 30 నుండి 60 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

మే 25 నుంచి జూన్ 1 వరకు రుతుపవనాలు పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరిస్తుందని అంచనా వేశారు. ఆగ్నేయ అరేబియా సముద్రంపై బలమైన పశ్చిమ గాలులు ఏర్పడి.. తేమను నేరుగా భారతదేశ నైరుతి తీరం వైపు మళ్లిస్తాయని భావిస్తున్నారు. దీని కారణంగా కేరళ, తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వచ్చే సమయానికి ఎల్ నినో ఉండదని అధికారి తెలిపారు.

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వేడితో చిన్నారుల, వృద్ధులు అల్లాడిపోతున్నారు. త్వరగా రుతుపవనాలు వస్తే ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అన్నదాతలకు కూడా శుభ పరిణామమే.

 

Monsoon 2026: The Andaman Gateway Opens: Monsoon Set to Cross the Islands by May 18th. Kerala Braces for a May Monsoon Arrival!

Based on the ECMWF sub-seasonal charts provided (Base time: April 22, 2026), here is a detailed breakdown of the weekly weather forecast for the second… pic.twitter.com/IhAl9T9hre

— Parthan IN Weather (@PIW44) April 23, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andaman monsoon update
  • early monsoon forecast India
  • ECMWF weather update
  • heatwave relief India
  • India monsoon 2026

తాజావార్తలు

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

  • Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions