Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్‌డేట్ ఇదే!
- లుంగి ఎంగిడికి తీవ్ర గాయం
- 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్
- ఎంగిడి తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lungi Ngidi Injury Update: ఐపీఎల్ 2026ఓ భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతి గాల్లోకి లేవగా.. దానిని క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. వెనక్కి అడుగులు వేస్తూ క్యాచ్ కోసం ప్రయత్నించిన తరుణంలో అదుపు తప్పి వెనుకకు పడిపోయాడు. ఈ క్రమంలో అతని తల మైదానానికి బలంగా తగలడమే కాకుండా.. మెడపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడింది.
కిందపడిన వెంటనే లుంగి ఎంగిడి నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే ఉండిపోయాడు. కనీసం కదలలేని స్థితిలో ఉన్న అతడిని చూసి తోటి ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అంపైర్లు ఆటను నిలిపివేయగా.. వైద్య సిబ్బంది స్ట్రెచర్‌తో మైదానంలోకి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎంగిడిని స్ట్రెచర్‌పైనే అంబులెన్స్‌లోకి ఎక్కించి నేరుగా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం రద్దీ సమయం అయినప్పటికీ అత్యవసర పరిస్థితిల్లో కేవలం 11 నిమిషాల్లోనే అతడిని ఆస్పత్రికి తరలించారు. న్యూఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పూసా రోడ్డులో ఉన్న బీఎల్‌కే-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సాధారణంగా ట్రాఫిక్ లేని పరిస్థితుల్లో 7.5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 15-20 నిమిషాలు పడుతుంది. అయితే దేశ రాజధానిలో సాయంత్రం రద్దీ సమయంలో కూడా.. ఎంగిడిని తీసుకుని అంబులెన్స్ స్టేడియం నుంచి కేవలం 11 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేరుకుంది. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఐపీఎల్ నిర్వాహకులు ఎంగిడి ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన చేశారు. ఎంగిడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అవసరమైన పరీక్షల అనంతరం శనివారం రాత్రే అతడిని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఈ వార్తతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తదుపరి మ్యాచ్‌లలో అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!